ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనునది భారతమాత ముద్దుబిడ్డ నిజమైన దేశభక్తుడు, దేశ స్వతంత్రం కోసం ఆజాద్ హింద్ పౌజ్ నిర్మించి బ్రిటీష్ వారిని గడగడ లాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నేతృత్వంలో 1939 మే 3న ఉత్తరప్రదేశ్ లోనీ ఉన్నావ్ ,మాకుర్ లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనీ ఒక వర్గంగా ఆవిర్భవించిన పార్టీ.
పచ్చిమ బెంగాల్ లో ఉన్నత కుటుంబంలో జన్మించిన నేతాజీ బ్రిటిష్ పాలనలో అత్యంత ఉన్నతమైన చదువు ఐపీఎస్ లో నాలుగవ ర్యాంకు సాధించి కూడా తన స్వార్థం కోసం బ్రిటిష్ వారి కింద ఉద్యోగం చేయకుండా స్వాభిమానం తో దేశ స్వా తంత్రం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ధీరుడు మన నేతాజీ.
తొలుత భారత జాతీయ కాంగ్రెస్లో చేరి అఖిలభారత యువజన కాంగ్రెస్కు అధ్యక్షులుగా పనిచేశారు తదుపరి 1938లో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ కి దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు..దేశానికి స్వాతంత్రం సాధించడంలో పాటించవలసిన వ్యూహాలపై మహాత్మా గాంధీకి మరియు చంద్రబోస్ గారికి బేదాభిప్రాయాలు ఉండేవి.గాంధీజీ మితవాద, సంతుస్టి కరణ, అహింస విధానాలతో నేతాజీ విబేదించేవారు..
చిన్నప్పటినుండే ప్రకర దేశభక్తుడైన చంద్రబోస్ స్వాతంత్రం అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు దానిని పోరాటాల ద్వారానే సాధించ వచ్చు అని నమ్మేవాడు..ఈ పోరాటంలో బ్రిటన్ కు శత్రు దేశాలైన రష్యా, జర్మనీ ,జపాన్ వంటి దేశాల సహాయం తీసుకోవాలని వాదించేవారు.. తదుపరి 1939 లో కూడా అధ్యక్షునిగా పోటీలో నిలబడ్డారు.కానీ అప్పటికే గాంధీజీ అభిప్రాయాలతో విభేదించిన కారణంగా మహాత్మా గాంధీ వేరొక అభ్యర్థికి తమ మద్దతు తెలిపాడు. అయినప్పటికీ మన నేతాజీ అఖిలభారత అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కానీ వారి మధ్య చాలా విషయాలలో భేదాభిప్రాయాలు ఉండడం కారణంగా ఇద్దరు కలిసి ఓకే పార్టీలో కొనసాగే పరిస్థితులు లేకుండా పోయాయి ..అందువలన మన నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్ లోని కొందరు అతివాద జాతీయ నాయకుల సహాయంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ని స్థాపించారు.