Allindiaforwardbloc.com

Categories
Articles

ముంచుకొస్తున్న ఎరువుల సంక్షోభం Copy

మన దేశానికి ఎరువులు ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌ కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పుడు యుద్ధంలో మునిగి ఉండటంతో రాబోయే వానకాలం సీజన్‌లో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటాయా అనే అనిశ్చితి నెలకొన్నది. మరోవైపు దేశీయ ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైన అలసత్వాన్ని చూపుతున్నది. సకాలంలో ఎరువులు లేకపోతే దేశ వ్యవసాయరంగం సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉన్నది.


ఐదవది, మొరాకో నుంచి మనకు డీఏపీ రావాల్సి ఉంది. కానీ, మొరాకోకు అవసరమైన ముడిపదార్థం అమ్మోనియా రష్యా నుంచి సరఫరా కావటం లేదు. దీంతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆరవది, ఎరువుల మార్కెట్లో ఉన్న మరో ప్రముఖ దేశమైన ఇరాన్‌తో ఇప్పటికీ మనకు సరైన ఒప్పందం లేదు.


గత యాసంగి సీజన్లో అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు లేవు. దీంతో ఎరువుల సరఫరా మార్గాల్లో ఎటువంటి ఆటంకాలూ లేవు. కాబట్టి రైతులకు ఎరువుల విషయంలో ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల లభ్యత గురించి ఆందోళన కలుగుతున్నది. మన దేశానికి కీలక సరఫరాదారులైన రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య దాదాపు రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతుండటం, నల్లసముద్రంలో సరఫరా మార్గాలకు ఆటంకాలు ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది.


ఎంఓపీ (మ్యురియేట్‌ ఆఫ్‌ పొటాష్‌) ఎరువుకు సంబంధించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారు రష్యా. మనదేశానికి అవసరమైన ఎంఓపీలో మూడోవంతును రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక యూరియా విషయానికొస్తే.. ఉక్రెయిన్‌పై మనం ఆధారపడుతున్నాం. భారతదేశానికి యూరియా ఎగుమతి చేస్తున్న దేశాల్లో మూడో స్థానంలో ఉక్రెయిన్‌ ఉంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నందున ఆ రెండు దేశాలేగాక బెలారస్‌, ఎస్తోనియా, లాత్వియా వంటి ఇతర దేశాల నుంచి కూడా ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తపడి.. ఎరువుల సరఫరా కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటంలో నిర్లక్ష్యం చూపుతున్నది. దేశీయంగా కూడా ఎరువుల ఉత్పత్తి పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు.. యూరియా, సహజ వాయువు, డీఏపీ, ఎంఓపీల ధరలు అంతర్జాతీయం గా పెరుగుతూ వాటి భారం రైతులపై పడే పరిస్థితి కనిపిస్తున్నది. దీని నుంచి రైతులను ఆదుకోవటానికి దేశ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి. కానీ, ఆ పని చేయకపోగా 2022-23లో ఎరువుల సబ్సిడీకి కేవలం ఒక లక్ష కోట్లు మాత్రమే కేటాయించింది. ఎరువుల సబ్సిడీకి సంబంధించి నిపుణులు ఈ ఆర్థిక సంవత్సరానికి చేసిన అంచనాల్లో ఇది సగం కూడా కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *