ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటిని రద్దుచేస్తూ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిందని ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ఎన్నికల కమిటిని రద్దుతో కమిటి చైర్మన్ ను కూడా బాద్యతలనుంచి తొలగించారు.ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కమిటి ప్రత్యేకంగా సమావేశమైంది.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమిటిని రద్దు చేయడం సంచలనంగా మారింది.రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ త్రపున సిం హం గుర్తుపై పోటీ చేయడానికి చాలామంది నేతలు ఆసక్తి కనబరుస్తున్న నేపద్యం లో పార్టీలోని కొందరివల్ల పార్టీపై దుష్ప్రచారం జరుగుతున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యవర్గం ప్రకటించిది.ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు ఆ.వి.ప్రసాద్ నేతృత్వంలో గత నేల రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుధీర్గంగా చర్చించిన అనంతరం ఎన్నికల కమిటిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కటకం మృత్యుంజయం పార్టీ విధి,విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కమిటి అభిప్రాయపడింది.అంతేకాకుండా రాష్ట్ర కమిటి,ఎన్నికల కమిటీతో సంబంధం లేకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తూ తప్పుడు సంకేతాలను పంపుతున్నారని నిర్ణయించి ఎన్నికల కమిటిని రద్దు చేశారు. ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక,ప్రచార వ్యవహారలన్నిటిని రాష్ట్ర కార్యవర్గానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి,బుచ్చిరెడ్డి, కార్యదర్శులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి,పి.కృష్ణమూర్తి,కొండ దయానంద్,నరేందర్ లు పాల్గొన్నారు.